హరిహర వీరమల్లు..రొమాంటిక్ సాంగ్!

8
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. జూన్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా సినిమాలోని మరో పాటకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

ఇప్పటివరకు మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా నాలుగో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. రొమాంటిక్ సాంగ్ ను అభిమానుల కోసం రిలీజ్ చేశారు. కీరవాణి మంచి ట్యూన్ ని అందించగా శ్రీహర్ష ఈమని అందించిన సాహిత్యం అందరిని ఆకట్టుకుంది. విజువల్స్ కూడా ఒకింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పాలి.

నిధి అగర్వాల్ తన గ్లామర్‌తో మరింత అందం తెచ్చింది. మొత్తానికి సాంగ్ అయితే బాగుంది. ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చుతుంది.ఇంకెందుకు ఆలస్యం సాంగ్‌ చూసి మీరు ఎంజాయ్ చేయండి.

- Advertisement -