దాయాదుల పోరు..తుది జట్లు ఇవే!

28
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాలైన భారత్ – పాకిస్థాన్ మధ్య ఉత్కంఠపోరుకు రంగం సిద్ధమైంది. అమెరికా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి.

ఐర్లాండ్‌తో ఆడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌కు దాదాపు కొనసాగించే అవకాశముండగా అక్షర్‌పటేల్‌ లేదా జడేజా స్థానంలో స్పిన్నర్‌ కుల్దీప్‌యాదవ్‌ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రోహిత్‌, కోహ్లీ ఓపెనర్లుగా రానుండగా రిషబ్‌ పంత్‌ మూడో స్థానంలో బరిలో దిగనున్నారు.

ఇక అమెరికాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది. పాక్‌ పేస్‌ బలంగా ఉండగా భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:ది బ‌ర్త్‌డే బాయ్.. టైటిల్ గ్లింప్స్

జట్ల అంచనా

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), కోహ్లీ, పంత్‌,సూర్యకుమార్‌, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌

పాకిస్థాన్‌: బాబర్‌(కెప్టెన్‌), రిజ్వాన్‌, ఉస్మాన్‌, జమాన్‌, ఆజమ్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌/ఆయూబ్‌, ఆఫ్రిది, నసీమ్‌, ఆమిర్‌, రవూఫ్‌.

- Advertisement -