మరోసారి తలపడనున్న దాయాదులు!

184
ind
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ – పాక్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. కోహ్లీ అద్భుత ప్రదర్శనతో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా మ్యాచ్‌ జరుగగా రోహిత్ సేన ఘన విజయాన్ని సాధించింది.

అయితే తాజాగా మరోసారి దాయాదులు తలపడనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం సూపర్-12 దశలో మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

ఈ జట్లు గ్రూప్‌లోని మిగిలిన జట్లైన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లపై విజయం సాధించాలి. అలాజరిగి ఇరు జట్లు సెమీస్‌కు వెళితే.. మరో గ్రూప్ నుంచి సెమిస్‌కు వచ్చిన ఇరు జట్లతో పాక్, భారత్ జట్లు ఆడాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు మ్యాచ్‌లలో‌సైతం ఇరుజట్లు తమతమ ప్రత్యర్థులపై విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇలా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 13న మళ్లీ మెల్‌బోర్న్ స్టేడియంలోనే ఇరు జట్ల మధ్య రసవత్తర మ్యాచ్‌చూసే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి..

టీ20లో కంగుతిన్న కంగారులు..కివీస్‌ గెలుపు

ఆసియా కప్‌ కోసం భారత్‌ పాక్‌కు వెళ్లదు: జేషా

మలంగ్‌ స్టేడియంను కూల్చివేస్తాం:ఇండోనేషియా ప్రభుత్వం

- Advertisement -