టీ20 వరల్డ్‌ కప్‌..శ్రీలంక వర్సెస్ నమిబియా

206
SL
- Advertisement -

ఆసీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్‌ ఇవాళ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నమీబియాతో శ్రీలంక తలపడనుంది. మొత్తం పదహారు జట్లు బరిలో నిలవగా ఈ మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత ఎడిషన్‌ ఫార్మాట్​నే ఈసారి కొనసాగిస్తున్నారు. ర్యాంకింగ్స్​ ప్రకారం అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌, ఇండియా, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా నేరుగా సూపర్‌ 12 బెర్తు దక్కించుకున్నాయి.

శ్రీలంక, నెదర్లాండ్స్​, యూఏఈ, నమీడియా (గ్రూప్​–ఎ), వెస్టిండీస్‌, ఐర్లాండ్​, స్కాట్లాండ్, జింబాబ్వే (గ్రూప్​–బి) ఆదివారం మొదలయ్యే తొలి దశలో పోటీ పడుతాయి. ప్రతీ గ్రూప్‌ నుంచి రెండేసి సూపర్ 12 క్వాలిఫై అవుతాయి. వచ్చే శనివారం మొదలయ్యే సూపర్‌ 12లో జట్లను మళ్లీ రెండు గ్రూప్​లుగా విభజించారు. ప్రతీ జట్టు తన గ్రూప్‌లోని మిగతా ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అలా రెండు గ్రూపుల్లో టాప్‌2లో నిలిచిన జట్లు సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. నవంబర్‌ 13 ఎంసీజీలో జరిగే మెగా ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.

- Advertisement -