ఆసీస్ ఔట్…సెమీస్‌లో ఆఫ్ఘానిస్తాన్

25
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్తాన్ సంచలనం సృష్టించింది. తొలిసారి సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. సూపర్‌ 8 పోరులో ఆసీస్‌ను మట్టికరిపించిన ఆఫ్ఘాన్‌ ఇవాళ జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘానిస్తాన్ 115 పరుగులు చేసింది. గుర్బాజ్ 43 పరుగులతో టాపర్‌గా నిలవగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం అయ్యారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు 19 ఓవ‌ర్ల‌లో 114 టార్గెట్‌ను బంగ్లాకు సెట్ చేశారు. అయితే ఏడు బంతులు మిగిలి ఉండ‌గానే బంగ్లాదేశ్ జ‌ట్టు 105 ర‌న్స్‌కే ఆలౌట్ అయ్యింది. లింట‌న్ దాస్ 54 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు.

గురువారం జ‌రిగిన తొలి సెమీస్‌లో సౌతాఫ్రికాను ఆఫ్ఘ‌నిస్తాన్ ఢీకొట్టనుండగా 27న రాత్రి 8 గంట‌ల‌కు ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య రెండో సెమీస్ జ‌ర‌గ‌నుంది.

Also Read:కృత్రిమ రంగులు..ఆ రాష్ట్రంలో నిషేధం!

- Advertisement -