2024..భారత క్రికెట్ చరిత్రలో గుర్తుంచుకోదగ్గ సంవత్సరం. ఎందుకంటే ఐసీసీ కప్ కోసం 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియా, ప్రేక్షకుల కోరికను నెరవేర్చింది రోహిత్ సేన. టోర్నిలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన టీమిండియా ఫైనల్‌లో కూడా అదే అద్భుత ఆటతీరును కనబర్చి విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్‌లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్వింటన్ డికాక్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31) ,క్లాసెన్ 52 పరుగులతో దక్షిణాఫ్రికా విజయం ఖాయమనుకునేలా చేశారు. అయితే ఈ క్రమంలో చివరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా ఓటమి తప్పలేదు.
అంతకముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 176/7 పరుగులు చేసింది. కోహ్లీ 76 , అక్షర్ పటేల్ 47 రన్స్, శివమ్ దూబే 27 పరుగులు చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాల భావోద్వేగం అందరినీ కదిలించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తర్వాత రోహిత్, కోహ్లీలు టీ20 ఇంటర్నేషనల్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్‌లో హైలైట్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. మిల్లర్ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద అద్భుతంగా పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు సూర్య. ఇది మ్యాచ్ విన్నింగ్ క్యాచ్‌గా నిలిచింది.
Also Read:TTD: అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ