దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించారు. ఫిల్ సాల్ట్ (141 నాటౌట్, 60 బంతుల్లో 15×4, 8×6), జోస్ బట్లర్ (83; 30 బంతుల్లో 8×4, 7×6) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 304 పరుగుల భారీ స్కోరును సాధించింది.
భారీ లక్ష్యచేధన లో దక్షిణాఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో 158పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 146 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో భారీ మార్జిన్‌తో గెలిచిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.
దక్షిణాఫ్రికా జట్టుపై టీ20ల్లో తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా ఫిల్ సాల్ట్ నిలిచాడు. తాజాగా సాల్ట్ 39 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. 2023లో జోనాథన్ చార్లెస్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. 2024లో టీమిండియాకు చెందిన తిలక్ వర్మ 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
Also Read:రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ క్లారిటీ!
🚨 PHIL SALT – FASTEST HUNDRED IN ENGLAND T20I HISTORY. 🚨 pic.twitter.com/zhR3qPFUss
— Johns. (@CricCrazyJohns) September 12, 2025

