భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన 165పరుగులను 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించారు భారత్ ఆటగాళ్లు. దీంతో 1-1తో సిరీస్ ను సమం చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణిత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
కోహ్లి 41 బంతుల్లో 61 రన్స్(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. దినేష్ కార్తీక్ 18 బంతుల్లో 22 పరుగులు(ఒక ఫోర్, ఒక సిక్స్) చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ 22 బంతుల్లోనే 41 రన్స్ చేశాడు(6 ఫోర్లు, 2 సిక్స్‌లు). ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఫించ్ (28), షార్ట్ (33) మంచి ఆరంభాన్నిచ్చినా.. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా.. నాలుగు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.