గత ఆదివారం(మార్చి 8న) ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో తలబడ్డ టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రాగా తాజాగా ఇందులో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది.
మెల్ బోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు 86,174 మంది అభిమానులు రాగా స్టేడియంలోని లెవల్ 2 నార్త్ స్టాండ్‌లోని సెక్షన్ 42లో కూర్చున్న అభిమానికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఆ స్టాండ్‌లో కూర్చున్న వారు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని ఆదేశించారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ధాటికి అంతర్జాతీయ టోర్నీలన్ని వాయిదాపడుతున్నాయి. తాజాగా ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా పర్యాటక వీసాల్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం ఐపీఎల్‌పైనా పడనుంది.