సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా: రంగారావు

876
rangarao
- Advertisement -

తనపై నమ్మకంతో విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్ ఛైర్మన్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్ ఛైర్మన్ తన్నీరు రంగారావు. హైదరాబాద్ నాంపల్లిలోని లక్డీకాపుల్ ఫ్యాబ్సీలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రంగారావు చేత ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషి ప్రమాణస్వీకారం చేయించగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పాల్గొన్నారు. రంగారావుతో పాటు టెక్నికల్ మెంబర్‌గా ఎండీ మనోహర్, ఫైనాన్స్ మెంబర్‌గా బి కృష్ణయ్య ప్రమాణస్వీకారం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పని చేసిన న్యాయవాదులను గుర్తించి సముచిత స్థానం కల్పించారని ఈ సందర్భంగా రంగారావు తెలిపారు. సీఎం తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు.

- Advertisement -