వ్యాపార విస్తరణ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్న బోయింగ్ ఇండియాకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఏరోస్పేస్ ఆవిష్కరణలను శక్తివంతం చేసేందుకు టీహబ్‌తో బోయింగ్ ఇండియా మంత్రి కేటీఆర్ నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ ఎంవోయు కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ టీహబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అని తెలిపారు. స్టార్టప్‌లకు టీ హబ్ వేదికగా నిలిచిందన్నారు. టీ హబ్ యావత్ దేశాన్నే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని కేటీఆర్ వెల్లడించారు. టీ హబ్ పల కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలుస్తోందన్నారు.రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా టీఎస్‌ఐపాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయగల ఏరోస్పేస్ పార్క్ ఆదిబట్లలో ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ పార్కును టాటా-బోయింగ్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ ఉండటంవల్ల తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది. తాజాగా బోయింగ్ ఇండియా..టీ హబ్‌తో కీలక ఒప్పందం చేసుకోవడంతో మరోముందడుగు పడింది.
IT Minister @KTRTRS and@amitabhk87, CEO @NITIAayog launched the @Boeing HorizonX India Innovation Challenge in partnership with @THubHyd. #Hyderabad #GES2017 #RoadToGES @startupindia @investindia pic.twitter.com/UztSXmpMyZ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 28, 2017