- Advertisement -
త్వరలో టీ హబ్ 2ని ఏర్పాటుచేయబోతున్నామని చెప్పారు ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ టీహబ్ దేశంలోనే విజయవంతమైన ఇంక్యుబేటర్ అన్నారు. టీ హబ్ 2 దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబెటర్ కానుందన్నారు. టీ హబ్ 2తో నాలుగు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
రాయదుర్గంలో రూ 276 కోట్లతో మూడు ఎకరాల్లో టీ హబ్ 2 ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. గోవా, ఢిల్లీ అస్సాం రాష్ట్రాలకు టెక్నాలజీ సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలోని ఆవిష్కణలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ఐటీని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధికల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు కేటీఆర్.
- Advertisement -