అమెరికాలో టీ బ్రిడ్జ్‌..ప్రారంభించిన కేటీఆర్

205
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన కొనసాగుతోంది. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో టీ హబ్ అనుబంధ టీ బ్రిడ్జ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్న వినూత్న ఆలోచనలను ముందుకు తీసుకెళ్లెందుకు టీ బ్రిడ్జ్‌ తోడ్పతుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు తెలంగాణను గమ్యస్ధానంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. అమెరికాలో టీ బ్రిడ్జ్‌ ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు.

రాష్ట్రానికి చెందిన స్టార్టప్‌లకు ప్రపంచస్ధాయి గుర్తింపు లభిస్తోందని అన్నారు. ప్రపంచంలోని 10 అత్యున్నత స్టార్టప్‌లలో హైదరాబాద్‌ను నిలపడమే లక్ష్యమని తెలిపారు. ఉబర్,టీఐఈలతో కలిసి టీ బ్రిడ్జ్‌ పనిచేయనుంది. భారతదేశంలో భారీ సాంకేతిక విభాగానికి తెలంగాణ గేట్ వేగా ఉందని కేటీఆర్ తెలిపారు. స్టార్టప్‌ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించేందుకు టీ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది.

Ktr

అంతకముందు అమెరికా పర్యటనలో భాగంగా మూడో రోజు శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి విధానపర నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకెళ్తొందని వివరించారు. అనంతరం ఉబెర్‌ కేంద్ర కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీలో ప్రారంభించే టీ-హబ్‌ అవుట్‌ పోస్టు, టీ-బ్రిడ్జి గురించి వివరించారు. తెలంగాణ ‌- సిలికాన్‌ వ్యాలీ మధ్య పరస్పర అంకురాల బదలాయింపునకు టీ-హబ్‌ దోహద పడుతుందన్నారు.

- Advertisement -