ఆగ‌స్ట్ 15న సాహో, సైరా…

329
sahoo syera
- Advertisement -

స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాల‌వాడ న‌రసింహరెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్క‌తున్న మూవీ సైరా నర‌సింహ‌రెడ్డి. ఈచిరంజీవి ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈసినిమాను ద‌ర్శకుడు సురెంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఈసినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హారిస్తున్నారు. ఈమూవీని 2019 ఆగ‌స్ట్ 15న విడుదల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే కీల‌క‌మైన సన్నివేశాల‌ను తెర‌కెక్కించ‌న‌ట్టు స‌మాచారం.

chiranjeevi

ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లోన‌టిస్తున్న సినిమా సాహో. సుజీత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ సంస్ధ‌వారు భారీ బ‌డ్జెట్ తో మూవీని తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్దా క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. భారీ యాక్ష‌న్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈసినిమాను ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే చిత్రిక‌రించారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్రభాస్ ఈమూవీలో న‌టిస్తుండ‌టంతో అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

prabhas

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ పెర‌గ‌డంతో ఆసినిమాపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్ధాయిలో అంచ‌నాలు ఉన్నాయి. ఈచిత్రాన్ని మొద‌ట 2019 స‌మ్మ‌ర్ లో విడుద‌ల చేయాల‌నిభావించినా..కొంత షూటింగ్ మిగిలి ఉండటంతో రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. ఈమూవీని 2019 ఆగ‌స్ట్ 15 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు వ‌స్తాయా లేక ఎవ‌రో ఒక‌రు త‌గ్గి రిలీజ్ ను వాయిదా వేసుకుంటారో చూడాలి.

- Advertisement -