స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధరాంగా సైరా మూవీ తెరెకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి నరసింహరెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు సుదీప్. జగపతి బాబు – నయనతార – తమన్నావంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈమూవీని నిర్మిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటివరకూ ఈ చిత్రం 40 శాతం వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈసినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీ 35 రోజుల షెడ్యూల్ పూర్తయినట్లు రత్నవేలు తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో తీసిన ఫొటోను ట్విటర్లో పంచుకున్నారు. ‘35 రాత్రుల సవాలుతో కూడిన షెడ్యూల్ పూర్తయింది. వర్షంలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. అద్భుతమైన నిర్మాణ విలువలతో భారీ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించాం. అతి తక్కువ కాంతిలో షూటింగ్ జరిగింది.. అద్భుతం. ‘సైరా’..’ అని ఆయన ట్వీట్ చేశారు.
రత్నవేలు షేర్ చేసిన ఫొటో చూస్తే ఎలాంటి వాతావరణంలో షూటింగ్ జరిగిందో అర్థమవుతుంది. స్టిల్లో చీకటిలో గుర్రాలపై వెళ్తున్న వ్యక్తులు కనిపించారు. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ నిపుణుడు గ్రాగ్ పావెల్ పనిచేస్తున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.