మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కానే లేదు. సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి మార్చ్ కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. హీరొయిన్ నయనతార ఎంట్రీతో ఇది కొనసాగనుంది అనే వార్తల నేపధ్యంలో ఎప్పటి నుంచి అనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులు కనివిని ఎరుగని స్థాయిలో అమ్ముడయ్యాయి అనే వార్త విని మెగా ఫాన్స్ ఆనందం పట్టలేకపోతున్నారు.
ప్రస్తుతం తన 101వ చిత్రం ‘సైరా’లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో చిత్ర పరిశ్రమకు మరోసారి తెలిసొచ్చింది. ఆయన చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా 30 కోట్లు ఇచ్చి ఇండియా మొత్తం రైట్స్‌ని సొంతం చేసుకుందట.
ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు… సినిమాకు సంబంధించి డిజిటల్ మీడియా మాధ్యమంగా సాగే అన్ని కార్యక్రమాల హక్కులూ అమెజాన్ కు దక్కాయని తెలుస్తుండగా, ఆ సంస్థ ఇంత భారీ మొత్తం ఇచ్చి ఓ సినిమాను కొనడం ఇదే తొలిసారని సమాచారం. ఇక అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘సైరా’లో భాగస్వామ్యం అయిందని భారీ మొత్తాన్ని ఇచ్చిందని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘వన్ అండ్ ఓన్రీ చిరంజీవి’, ‘మెగాస్టారా మజాకా’, ‘చిరంజీవికే అంతటి సత్తా ఉంది’ అని కామెంట్లు పెడుతున్నారు.