మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం టీజర్ విడుదల కాగా యూ ట్యూబ్‌ని షేక్ చేసింది. వివిధ భాషల్లో విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.తెలుగు,తమిళ,హిందీ,మలయాళం,కన్నడ భాషల్లో కలిపి కేవలం 24 గంటల్లోనే 23.2 డిజిటల్ వ్యూస్‌ని రాబట్టి చిరు స్టెమినాను నిరూపించింది.
కన్నడంలో సైరా టీజర్ ఇప్పటి వరకు 3.7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన పహిల్వాన్ టీజర్ 24 గంటల్లో 2.4 మిలియన్ వ్యూస్ సాధించి టాప్‌లో ఉంది. ఆ రికార్డును మెగాస్టార్ సైరా బీట్ చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానుంది.