అరచేతుల్లో చెమటలు వస్తే..యమ డేంజర్!

30
- Advertisement -

సాధారణంగా శరీర శ్రమ చేసేటప్పుడు చెమటలు రావడం సహజం. కొన్ని సందర్భాల్లో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కూడా ఉక్కపోతగా మారి చెమటలు పడుతుంటాయి. సాధారణంగా చెమట అనేది చర్మంపై అని భాగాల్లోనూ ఏర్పడుతూ ఉంటుంది. అయితే అరచేతులు లేదా అరికాళ్ళలో చెమట రావడం చాలా అరుదు. కానీ కొందరికి మాత్రం ఈ ప్రదేశాల్లో ఎక్కువగా చెమట ఏర్పడుతుంది. ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినప్పటికి వారిలో ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే ఇలా అరచేతులు, అరికాళ్ళలో ఎక్కువగా చెమట రావడం వెనుక ప్రమాదకర ఆరోగ్య సమస్య ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో లివర్ ప్రమాదస్థితిలో ఉందనడానికి కారణమట. లివర్ పై కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, లివర్ పనితీరు మందగించినప్పుడు అరచేతులు మరియు అరికాళ్ళలో ఎక్కువగా చెమట ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి ఈ ప్రదేశాలలో చెమట సమస్య ఎక్కువగా ఉన్నవారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఇది ఏ మాత్రం సాధారణ సమస్య కాదని ఫ్యాటి లివర్ కూడా దారి తీసి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి అరచేతుల్లోనూ, ఆరికాళ్ళలోనూ అధికంగా చెమటలు వస్తూఉంటే వైద్యుడిని సంప్రదించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. మద్యపానం ధూమపానం అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానుకోవడం మంచిది. ఇంకా శారీరక శ్రమ లేని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. ఇంకా నీరు బాగా తాగాలి అలాగే ఇమ్యూనిటీని పెంచే పండ్ల రసాలు కూడా సేవించాలి. తద్వారా అరచేతులు, అరికాళ్ళలో చెమట తగ్గడంతో పాటు ఫ్యాటిలివర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Also Read:Rohith Sharma: చివరి టెస్టుకు రోహిత్ దూరం?

- Advertisement -