తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు , స్వేరోస్ వ్యవస్థాపకులు, తెలంగాణ గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మధ్య వివాదం ఇప్పట్లో చల్లారే లేదు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బౌద్ధం పేరుతో హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, స్వేరోస్ సంస్థకు వస్తున్న నిధులపై సీబీఐ చేత విచారణ చేయించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలతో అణగారిన వర్గాలు భగ్గుమన్నాయి. తెలంగాణలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తూ..వారి భవిష్యత్తును అత్యుత్తమ స్థాయిలో తీర్చిదిద్దుతున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై బండి చేసిన విమర్శలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా స్వేరోస్ సభ్యులు, జై భీమ్ కార్యకర్తలు, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు.
ఇటీవల హుజూర్నగర్ పర్యటనకు వెళ్లిన బండి సంజయ్ కాన్వాయ్‌ను స్వేరోస్, జై భీమ్ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపిన్రు. తక్షణమే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు క్షమాపణలు చెప్పాలంటూ బండి దిష్టిబొమ్మలను తగలబెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్రు. ఈ సందర్భంగా కొందరు స్వేరోస్ మహిళలు పదునైన మాటలతో బండి సంజయ్‌ను ఉతికారేస్తున్నారు. తాజాగా బండి సంజయ్‌పై ఓ మహిళ విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అట్టడుగు వర్గాల పిల్లలను కిందిస్థాయి నుంచి పై స్థాయికి తీసుకువెళుతుంటే..ఈ రౌడీయిజం, ఈ గూండాయిజం ఏంటీ.. అఆలు ఇఈలు రాని గాడిదలు..ఇయాల ప్రవీణ్‌కుమార్ సార్‌ను వేలెత్తి చూపేందుకు పనికిరారు అంటూ బండి సంజయ్‌ను చదువురాని సన్నాసి అంటూ ఫైర్ అయింది.
అరే చెక్కా..ఓరేయ్ బండి సంజయ్..నీ బతుకు ఏడరా..నువ్వు గల్లీ లీడర్‌వి, నువ్వో గూండాగానివి అంటూ దూషించింది..నీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కాపాడుకురో బడవా..మా సార్‌ను అంటవరా అంటూ తీవ్ర పదజాలంతో ఆ మహిళ విరుచుకుపడింది. ప్రవీణ్ సారు మారుమూల గ్రామం నుంచి వచ్చి ఓ ఉన్నత స్థానానికి వచ్చాడురా వెధవా..అరేయ్ నీకు చదువు విలువ తెలియదు..మనుషులకు గౌరవం ఇవ్వడం తెలియదంటూ ఆ మహిళ మాటల్లో రాయరాని పదాలతో బండిపై తిట్ట దండకం అందుకుంది. కాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు స్వేరోస్ సభ్యులు, జై భీమ్ కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలు బండి సంజయ్‌ను మరింత కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బండి సంజయ్‌పై స్వేరోస్ మహిళ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.