గతేడాది రైల్వేస్టేషన్ లో స్వాతి అనే 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దారుణంగా హత్య చేశారు. తమిళనాడు చెన్నైలోని నుంగంబాకం రైల్వేస్టేషన్ లో స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఆమెను అందరూ చూస్తుండగానే చంపేశారు. ఈ విషయం మీడియాలో బాగా హైలైట్ అవడంతో పాటు కోర్టు కూడా సీరియస్ అయింది. ఈ కేసులో నిందితుడిగా పోలీసులు పట్టుకున్న రామ్ కుమార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ ఈ కేసులో చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు.
ఎన్నో రహస్యాలు దాగి వున్న ఈ హత్య కేసును ‘స్వాతి కొలై వళక్కు’ పేరుతో తమిళంలో వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు ఆర్‌డీ రమేష్ సెల్వన్. తమిళనాట అత్యంత వివాదాస్పమైన కేసు ఇప్పుడు వెండితెరపై… అంటూ సోమవారం రాత్రి చెన్నైలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఎప్పట్నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని చాలా రహస్యంగా చిత్రీకరించారు.
స్వాతి హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసు ఆఫీసర్ కోణం నుంచి ఈ సినిమా కథ నడుస్తుంది. స్వాతి మర్డర్ వెనుక నేపథ్యం ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేలిన అంశాలు.. ఆమె నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా సినిమా రూపొందుతోందని నిర్మాతలు చెబుతున్నారు. ట్రైలర్ ఎండింగ్ లో ‘ద మోర్ టు కమ్’ అనే ఫినిషింగ్ టచ్ ఇవ్వడం ద్వారా ఈ కేసులో చెప్పాల్సింది చాలానే ఉందని చెప్పకనే చెప్పారు. స్వాతి హత్య కేసును విచారించే పోలీసు అధికారిగా అజ్మల్ నటిస్తున్నాడు. హత్యకు గురైన స్వాతి పాత్రలో వర్ధమానతార ఆయిరా, రామ్‌కుమార్ పాత్రలో కొత్తనటుడు మనో నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు ఎ.వెంకటేష్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన తమిళ మూవీ ట్రైలర్ ను మీరూ చూడండి.
https://youtu.be/W0GZU-MhXfc