వెంగమాంబ రచనలు మహిళా సాధికారతకు మార్గదర్శకం

6
- Advertisement -

తారిగొండ వెంగమంబ ఆనాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, మహిళ సాధికారతను తీసుకువచ్చి, తిరుమలలో అన్నప్రసాద వితరణకు మార్గదర్శకత్వం వహించినట్లు విశాఖ శార‌ద పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌స్వామి ఉద్ఘాటచారు.

గురువారం సాయంత్రం టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్వేతాలో టీటీడీ సీనియర్ అధికారులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియాల ద్వారా ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

“భారతదేశంలోని పురాతన దేవాలయాలు విజ్ఞానం, నీతి, సామాజిక సేవ మరియు ఆదాయ కేంద్రాలని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను ప్రతి వ్యక్తి స్వీకరించాలని, భావి తరాలకు మన వేద ధర్మాన్ని అందించాలని పిలుపునిచ్చారు”.

టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ మరియు ధార్మిక పుస్తకాలను ప్రచురించడం ద్వారా మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా హిందూ ధర్మ ప్రచారాన్ని విస్కృతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు ప్రతి ఒక్కరికి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. కనుక మన సనాతన ధార్మిక అంశాలను సాంఘిక మాధ్యమాల ద్వారా మరింత విస్తారంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

Also Read:‘రాజు యాదవ్’..ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్

- Advertisement -