కేసీఆర్ యాదాద్రిని అత్యద్భుతంగా నిర్మించారు- స్వరూపానందేంద్ర స్వామి

71
Swaroopananda Swamy
- Advertisement -

మంగళవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామీలు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధానాలయ నిర్మాణాలను పరిశీలించారు స్వరూపానందేంద్ర స్వామివారు. ఆలయ ఉద్గాటన తర్వాత దర్శించుకున్న మొట్టమొదటి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కావడం విశేషం. అర్చకులు.. ఆలయ ఈఓ గీత వారికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం స్వరూపానందేంద్ర స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. కరోనా కారణంగా విశాఖ,ఋషికేశి లోనే గడపడం జరిగింది. ఏకాదశి,మంగళవారం నాడు యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకున్నాను. అత్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని కొనియాడారు.

దేశంలోనే ఎంతో మంది హిందువులము అంటారు.. కానీ ఎవ్వరు చేయని నిర్మాణం చేశారు సీఎం కేసీఆర్.. ఇది ఒక అద్భుతం.. ప్రజలకు భక్తులకు ఇది ఆధ్యాత్మిక స్వర్గదమం అన్నారు. ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలి. హిందు దేవాలయాలు ఎవరి సొత్తు కాదు.. ప్రజాలందరివి.. యుగ యుగాలుగా శైవులు వైష్ణవులు వైశ్యమ్యాలతో కొట్టుకున్నారు. ఆది శంకరాచార్యుల వారు అందరూ సమానంగా చూశారు. అన్ని దేవతలా నిలయం యాదగిరిగుట్ట.. అంత మంచి జరగాలి అందరూ సంతోషంగా ఉండాలి స్వరూపానందేంద్ర స్వామి కోరుకున్నారు.

- Advertisement -