న్యూడ్‌ సీన్‌ లీక్‌…కావాలనే చేశారా..?

514
Swara Bhaskar's NUDE scenes from Anarkali of Arrah LEAKED ...
- Advertisement -

మొన్నటిదాకా వార్తల్లోనే లేని ఓ సినిమా పేరు ఇప్పుడు అందరి నోటా అదేపనిగా వినబడుతుంది. ఆ సినిమానే ‘అనార్కలి ఆఫ్ ఆరా’. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని న్యూడ్ సీన్లు బయటపడ్డాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్లకి  సెన్సార్ లో కత్తెర పడింది.  అయితే  చెత్తబుట్టలో ఉండాల్సిన ఆ సీన్లన్నీ ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

అందుకే ఇప్పుడు అందరూ  ఈ సినిమా గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇది కూడా ఈ సినిమాకు కొంత మేర హైప్ రావడానికి కారణమైందనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఇదేదో నిర్మాతలు కావాలని చేసిన వ్యవహారం లాగే కనిపిస్తోంద టాక్‌. ఇదీ బాలీవుడ్ మూవీ ‘అనార్కలి ఆఫ్ ఆరా’ చుట్టూ నెలకొన్న వివాదం.
Swara Bhaskar's NUDE scenes from Anarkali of Arrah LEAKED ...
తను వెడ్స్ మను’ లాంటి సినిమాల్లోనూ మెరిసిన స్వర భాస్కర్ ప్రధాన పాత్రలో తెరకెకకిన చిత్రమే ‘అనార్కలి ఆఫ్ ఆరా’. ఐతే ఆమె ఏమీ అంత పేరున్న హీరోయిన్ కూడా కాదు. దీంతో ఈ సినిమాకు అనుకున్నంతగా హైప్ రాలేదు. అందుకే సెన్సార్ వాళ్లు నో చెప్పిన న్యూడ్ సీన్స్ అన్నింటినీ కలిపి నిర్మాతలే ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్లో లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అందులో స్వర భాస్కర్ ను కొందరు టీజ్ చేసే సీన్స్ ఉన్నాయి. అలాగే ఆమె బ్యాక్ లెస్ గా కనిపిస్తోంది ఇంకో సీన్లో. ఈ లీక్ వ్యవహారం మీద నిర్మాతలు మండి పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఐతే ఈ వీడియో పుణ్యమా అని సినిమాకు ఉన్నట్లుండి హైప్ రావడంతో లోలోన నిర్మాతలు చాలా సంతోషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -