తారక్‌ వల్లే ప్రసాద్‌తో పెళ్లి: స్వప్న దత్

68
Swapna_Dutt
- Advertisement -

తారక్ వల్లే తన వివాహం జరిగిందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు స్వప్నాదత్ తెలిపారు. తండ్రి తర్వాత వైజయంతి బ్యానర్ బాధ్యతలను తన సోదరి ప్రియాంక దత్‌తో కలిసి చూస్తున్న స్వప్న ఓ ఇంటర్య్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పెళ్లికి ముందు తన భర్త ప్రసాద్‌ వర్మ, తాను కొంతకాలం ప్రేమించుకున్నాం. అయితే ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పే ధైర్యం చేయలేకపోయానని తెలిపారు. నాన్న కచ్చితంగా నిరాకరిస్తారని తెలిసి శక్తి సినిమా సమయంలో ఈ విషయాన్ని తారక్‌తో పంచుకున్నారని తెలిపింది.

తారక్ ఇచ్చిన సలహాతో ధైర్యం వచ్చిందని…ఆయనే స్వయంగా వచ్చి నాన్నతో మాట్లాడి ఒప్పించారన్నారు. అలా మా పెళ్లికి తారక్‌ మూలకారణం అయ్యారని తెలిపింది.

- Advertisement -