- Advertisement -
సిద్ధిపేట… తెలంగాణ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకున్న సిద్ధిపేట తాజాగా మరో ఘనత సాధించింది. మంత్రి హరీష్ రావు సారధ్యంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్న సిద్ధిపేట తాజాగా ఎక్స్ లెన్స్ అవార్డును సొంతం చేసుకుంది. సౌతిండియాలోనే బెస్ట్ క్లీన్ సిటీ అవార్డుకు ఎంపికై ఆదర్శంగా నిలిచింది. ఈ అవార్డు కోసం దేశంలోని 4వేల 41 మున్సిపాలిటీలు పోటీపడగా సిద్ధిపేట మున్సిపాలిటీకి అవార్డు వరించింది. పారిశుద్ధం, తడి, పొడి చెత్త సేకరణ, చెత్తతో కంపోస్టు ఎరువుల తయారీ, తదితర 42 అంశాలలో సిద్ధిపేట మున్సిపాలిటీకి 1400 మార్కులు వచ్చాయి. పట్టణానికి అవార్డు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -