వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నటుడు ప్రియదర్శి. కమెడీయన్‌గా సినిమా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రియదర్శి. ముఖ్యంగా బలగం తర్వాత ప్రియదర్శికి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ రాగా వరుస సక్సెస్‌లో దూసుకుపోతున్న ప్రియదర్శి తాజాగా నటించిన చిత్రం సుయోధన. ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహించారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించగా ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటించారు. మరి వరుస సక్సెస్‌లో ఉన్న ప్రియదర్శికి సుయోధన మరో హిట్ ఇచ్చిందా లేదా తెలుసుకుందాం.
కథ:
వరుణ్ (ప్రియదర్శి) .. ‘ఫోలే’ (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. వరుణ్‌కి చిన్నప్పటి నుండి ‘సుయోధన’ అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ళముందు కదలాడుతూ ఉంటుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా అతను భయపడుతుంటాడు. అయితే నాటకాలు వేసే వరుణ్ తండ్రి సాయికుమార్‌కి దుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. ఇది చూసే వరుణ్ భయపడుతున్నాడని అనుకుంటారు. సీన్ కట్ చేస్తే… పొలిటిషియన్‌గా మారిన వరుణ్ తండ్రి సాయికుమార్‌తో ప్రియదర్శిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో సాయికుమార్ చనిపోగా తర్వాత ఏం జరుగుతుంది… చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సుయోధన కథ.
ప్లస్ పాయింట్స్:
సస్పెన్స్ థ్రిల్లర్ పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సాయికుమార్ దుర్యోధనుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. హీరోయిన్ ద్రిశికా చందర్‌కు తన పాత్రకు వందశాతం న్యాయం చేయగా విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ ,సత్యదేవ్, బిత్తిరి సత్తి తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ముఖ్యంగా సినిమా ఆరంభం నుంచి దర్శకుడు ప్రేక్షకులకు సస్పెన్స్ క్రియేట్ చేయడంలోచాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ను కూడా బాగా చూపించాడు.
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్ ,కొన్ని సీన్స్,మాస్ ఆడియన్స్‌కు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు.కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరికొంత పకడ్బందీగా ఉంటే బాగుండేది
సాంకేతిక విభాగం:
దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్‌కు.. జై క్రిష్ అందించిన సంగీతం సూపర్బ్. సౌండ్ డిజైన్ సినిమా హైలైట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ థ్రిల్లింగ్ ఫీల్‌ను బాగా తీసుకువచ్చింది.బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్‌ను పెంచింది.కథనం నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ తర్వాత ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు వెండితెరపై చాలానే వచ్చిన ప్రేక్షకులకు ‘ఫోలే’ ఆర్టిస్ట్ అనేది కొత్త ట్రీట్మెంట్ అనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా? అని సుయోధన ద్వారా ప్రేక్షకులు తెలుసుకుంటారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథ, నటీనటులు, ట్విస్ట్‌లు ఇలా సినిమాకు అన్ని కలిసిరాగా ఓవరాల్‌గా కొత్తదనాన్ని కొరుకునే ప్రేక్షకులకు నచ్చే చిత్రం సుయోధన.
రేటింగ్:3/5
Also Read;బైకర్..స్టూడెంట్స్ చూడాల్సిన మూవీ!

