ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా సుష్మ స్వరాజ్..?

372
Sushma Swaraj
- Advertisement -

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాలకి ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తున్నారు. త్వరలో ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు రానున్నారని సమాచారం. ఇవాళ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.

ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.. ఏపీకి గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకొస్తారని సమాచారం.

Sushma Swaraj

ప‌దేళ్ల కాలంలో న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు. అయితే, ఇప్పుడు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి అయిదేళ్లు పూర్త‌యింది. తెలంగాణ‌లో రెండో విడ‌త టీఆర్‌య‌స్ ప్ర‌భుత్వం.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాయి. ఈ రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త ఏర్ప‌డింది. దీంతో పాటుగా ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో కొత్త రాజ‌ధాని నిర్మాణం.. అధికారిక కార్య‌క్ర‌మాలు అమ‌రావ‌తి నుండే నిర్వ‌హిస్తున్నారు.

ఇక‌, కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మాకంపై ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తోనూ కేంద్ర ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా..ఇద్ద‌రూ అంగీక‌రించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మా స్వ‌రాజ్‌ను ఎంపిక చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

- Advertisement -