‘చి.ల.సౌ’తో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు సుశాంత్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల…వైకుంఠపురుములో’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కథల ఎంపికలో కేర్ తీసుకుంటున్న ఈ యువ హీరో ఇప్పుడు ఎస్.దర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంలో నటించనున్నారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందనుంది.
ఈ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ని శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సైన్ బోర్డ్‌తో పాటు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, దానిపై గులాబీ పువ్వు కూడా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేపుతుంది. జనవరి 2020 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవి శంకర్ శాస్త్రి, హరీష్ కోయిల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.