సుశాంత్-ప్రియా ఆనంద్ “మా నీళ్ల ట్యాంక్”

82
sushanth
- Advertisement -

ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ’ కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు తాజాగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు సుశాంత్ “మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్ లో నటించడం విశేషం. ఈ శిరీస్ -ఒక చిన్న గ్రామం ఆధారంగా రూపొందించబడిన రొమాంటిక్ కామెడీ తో హార్ట్‌త్రోబ్ “మా నీళ్ల ట్యాంక్’. ఈ వెబ్ సిరీస్ ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది. ఇందులో నటి ప్రియా ఆనంద్ 10 సంవత్సరాల విరామం తర్వాత తెలుగు తెరపై నటిస్తుంది.

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ… “మా నీళ్ల ట్యాంక్’ 8-ఎపిసోడ్‌లు కలిగిన వెబ్ సిరీస్. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి కథ.. బుచ్చివోలు అనే గ్రామం నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఒక ఉత్తేజకరమైన విధంగా సాగుతుంది. ఎమ్మెల్యే కోదండం కుమారుడు గోపాల్ తను ప్రేమించిన సురేఖ తిరిగి రాకపోతే పనికిరాని వాటర్ ట్యాంక్‌లో దూకుతానని బెదిరిస్తాడు.అప్పుడే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎందుకు తన కొడుకు ఇలా చేస్తున్నాడని కోదండం కంగుతింటాడు . అతని బంధువు నరసింహం, అదే సమయంలో, అతని ప్రతిష్టను దెబ్బతీయడానికి మరియు అధికారాన్ని చేజిక్కించు కోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగే అదే ఊరిలో గిరి అనే సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు ఊరి నుంచి బదిలీ కావాల్సి వస్తే సురేఖను తిరిగి తీసుకొచ్చే పనిని అప్పగిస్తారు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య పిల్లి మరియు ఎలుక ల ఆట మాదిరి జరుగుతుంటే ,మరో వైపు గురుమూర్తి వాటర్ ట్యాంక్‌ మరమ్మతుల నుండి డబ్బును పొందాలని కోరుకుంటాడు. పనికిరాని ట్యాంక్ మరియు అమాయక సురేఖ చిన్న లక్ష్యాలతో స్వార్థపరుల చేతుల్లో ఎలా సాధనాలుగా మారారని రొమాంటిక్ కామెడీ తో చక్కగా తెరకేక్కించాము. నాకిలాంటి మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ZEE5 కు నా ధన్యవాదాలు అన్నారు.

తారాగణం:
వంశీగా సుశాంత్
సురేఖగా ప్రియా ఆనంద్
గోపాల్‌గా సుదర్శన్
కోదండంగా ప్రేమ్ సాగర్
చాముండిగా నిరోషా
నరసింహంగా రామరాజు
రమ్యగా దివి
బూనెమ్మగా అన్నపూర్ణమ్మ
రమణగా అప్పాజీ అంబరీష
భార్గవిగా బిందు చంద్రమౌళి
సుబ్బుగా సందీప్ వారణాసి
రేవతిగా లావణ్య రెడ్డి

- Advertisement -