బండి తియ్‌…సుశాంత్‌ మాస్ సాంగ్

55
bandi

హీరో సుశాంత్ తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను ఎక్కువ‌గా చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొంది ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌కు, రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘బండి తియ్’ అనే మాంచి మాస్ సాంగ్‌ను అక్కినేని నాగ చైతన్య రిలీజ్ చేసి, చిత్రం మంచి విజయం సాధించాలంటూ.. బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

#IVNR Bandi Thiyy Song | Sushanth A, Meenakshi Chaudhary | Pravin Lakkaraju | Rahul Sipligunj