ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. భారత్ విధించిన 181 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో భారత్ విజయంపై మాట్లాడిన సూర్య కుమార్ యాదవ్… జట్టులోని ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన చేశారని.. తొలుత 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో మ్యాచ్‌ను చేజార్చుకోవద్దని భావించాము అన్నారు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడ్డాం… అయితే ఈ క్లిష్ట సమయంలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె చాలా గొప్పగా ఆడారు అన్నారు.
ఇంగ్లాండ్ పవర్ ప్లే లో ధాటిగా ఆడింది అయితే పవర్ ప్లే తరువాత మ్యాచ్ తమ నియంత్రణలోకి వస్తుందని తెలుసు అని చెప్పాడు. ముఖ్యంగా 7 నుంచి 10 ఓవర్ల మధ్య రెండు మూడు వికెట్లు తీస్తే మ్యాచ్ ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో అలాగే జరిగింది. వికెట్లు పడడంతో మ్యాచ్ మా కంట్రోల్ లోకి వచ్చిందని తెలిపాడు సూర్యకుమార్.
Also Read:8వ సారి..తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కేనా?