రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో శ్రీలంకను చిత్తు చేసింది భారత్. సూర్య క్లాసిక్ ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు రాణించడంతో లంక చిత్తైంది. భారత్ విధించిన 229 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక..137 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 91 పరుగుల తేడాతో విజయం సాధించింది.
లంక బ్యాటర్లలో నిస్సాంక(15), కుశాల్ మెండిస్(23), ధనుంజయ(22), అసలంక(19), శనక(23) రన్స్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, చాహల్, ఉమ్రాన్ మాలిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపించారు. 51 బంతుల్లోనే 112 పరుగులతో 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో మెరుపు సెంచరీ చేశాడు. సూర్య ప్రతాపానికి లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సూర్యకుమార్ కు టీ20ల్లో ఇది మూడో సెంచరీ.
ఇవి కూడా చదవండి..