నిహారిక హైలైట్‌గా ‘సూర్యకాంతం’ ట్రైలర్..

224
Suryakantam Movie Trailer
- Advertisement -

మెగా డాటర్ నీహారిక టైటిల్ రోల్‌లో రాహుల్ విజయ్ హీరోగా నటించిన చిత్రం సూర్యకాంతం. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సూర్యకాంతం .. పూజా అనే ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే అభి అనే కుర్రాడి కథే ఈ సినిమా అనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమైపోతోంది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాకి నిహారిక పాత్ర హైలైట్ గా నిలుస్తుందనే విషయం స్పష్టమైపోతోంది. ఈ సినిమాతో ఆమెకి హిట్ పడుతుందేమో చూడాలి.

- Advertisement -