సూర్య విధ్వంసం.. సిరీస్ సమం!

38
- Advertisement -

భారత్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ 1-1 తో సమం అయింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా రెండో మ్యాచ్ లో సఫారీ జట్టు విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ సౌతాఫ్రికాపై టీమిండియా పైచేయి సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లలో గిల్ (12) నిరాశ పరిచినప్పటికి జైస్వాల్ (60) సెంచరీతో రాణించాడు. వరుసగా వికెట్లు పడుతున్న వేళ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( 56 బంతుల్లో 100 పరుగులు ) సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.

178.57 స్ట్రైక్ రేట్ తో (8 సిక్సులు, 7 ఫోర్లు ) సూర్య చేసిన విధ్వంసం ధాటికి సఫారీ బౌలర్లు కుదేలయ్యాయి. ఫలితంగా సౌతాఫ్రికా ముంగిట 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టు 95 పరుగులకే ఆలౌట్ గా నిలిచింది. మార్క్రామ్ (25), మిల్లర్ (35) జట్టును ఆడుకునే ప్రయత్నం చేసినప్పటికీ వరుసగా వికెట్లు పడడంతో సఫారీ జట్టు ఓటమి పాలు అయింది. ఫలితంగా ఇరు జట్లకు చెరో విజయం నమోదు కావడంతో సిరీస్ సమం అయింది. ఇక ఈ నెల 17 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తరువాత రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా ఆడనున్నాయి ఇరు జట్లు. ఈ టెస్ట్ సిరీస్ కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నారు.

Also Read:శ్రీ‌వాణి ట్ర‌స్టు… 3,615 ఆల‌యాల నిర్మాణం

- Advertisement -