ముగిసిన సూర్యగ్రహణం…

545
surya grahanam
- Advertisement -

సూర్యగ్రహణం ముగిసింది. ఉదయం 8:08 గంటలకు ప్రారంభమైన సూర్య గ్రహణం 11:11 గంటలకు ముగిసింది. సూర్యగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. సూర్యగ్రహణం ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులు సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. ఆలయాల శుద్ధి అనంతరం దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.

ఢిల్లీలోని తన నివాసంలో గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించినప్పటికీ.. మబ్బుల వల్ల సూరగ్రహణాన్ని చూడలేకపోయారు.

భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, ఒమన్‌, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్‌, మరియానా దీవులు, గువామ్‌లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది.

- Advertisement -