తెలంగాణపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తప్పుడు సర్వేలను నమ్మొద్దని ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్ స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుందన్నారు.
గోబెల్స్ కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని…వాళ్లు చేసే తప్పుడు ప్రచారంతో గందరగోళపడవద్దు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
గోబెల్స్ కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది.
వాళ్లు చేసే తప్పుడు ప్రచారంతో గందరగోళపడవద్దు అని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుంది#TelanganaWithKCR
— KTR (@KTRTRS) December 5, 2018
మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే వెనుక చంద్రబాబు హస్తం ఉందని అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బోగస్ సర్వేలను ప్రజలు నమ్మొద్దు. ఓటమి భయంతోనే కూటమి నేతలు బోగస్ సర్వేలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని వెల్లడించారు.