సర్వే తీర్పు.. ఆ పార్టీలదే హవా !

77
- Advertisement -

ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది సర్వేల కోలాహలం మొదలౌతుంది.పార్టీలపై ప్రజాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి. ఎవరికి అధికారం లభించబోతుంది ? ఏ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కాబోతుంది ? ఇలాంటి విషయాలపై సర్వేలు ఇచ్చే తీర్పు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది. అన్నీ సందర్భాల్లో సర్వేల ఫలితాలే నిజం కాకపోవచ్చు కానీ ఎంతో కొంత సర్వేల ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ నవ భారత్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

Also Read: SanthoshKumar:పర్యావరణ పరిరక్షణే నా ధ్యేయం

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఆ సర్వే తేల్చి చెప్పింది. దాదాపుగా 292 నుంచి 338 సీట్లు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందట. ఇక కాంగ్రెస్ కూటమి 106 నుంచి 114 సీట్లు సాధించే అవకాశం ఉందట. ఈ సీట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని కూడా ఆ సర్వే చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు కూడా కాంగ్రెస్ కు ప్లేస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: రోజుల్లో 12గంటల పనివేళలు.. ఎక్కడంటే!

ఎందుకంటే మోడి సర్కార్ పై ఉన్న వ్యతిరేకత రాహుల్ గాంధీపై సింపతీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకుల అంచనా. దీంతో సర్వే ఫలితాలను అటుంచితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ అని కొందరి అభిప్రాయం. ఇక రాష్ట్రాల వారీగా చూసినట్లైతే టైమ్స్ ఆఫ్ నౌ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. ఏపీలో వైసీపీకి 24-25 సీట్లు, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 22 సీట్లు, బిహార్ లోని జనతాదళ్ పార్టీకి 11 నుంచి 13 సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. ఏపీలో వైసీపీకి క్లీన్ స్వీప్ గా సీట్లను కట్టబెట్టడం గమనార్హం. మరి ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికి వచ్చే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -