Suriya:’సూర్య 46′..షూటింగ్ పూర్తి

5
- Advertisement -

మే 2025లో ప్రముఖ నటుడు సూర్య, చివరిగా లక్కీ బాస్కర్ చిత్రంతో హిట్ అందుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు తాత్కాలికంగా ‘సూర్య 46’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు. సినిమా విడుదల తేదీతో పాటు ఇతర కీలక వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Also Read:ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు

- Advertisement -