ఆస్పత్రిలో బాలయ్య!

46
- Advertisement -

బాలకృష్ణ ఫ్యాన్స్‌కు షాకింగ్ వార్త. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న బాలయ్యకు డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత బాలయ్య ఆస్పత్రిలో డాక్టర్స్‌తో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలకృష్ణ కు జరిగింది మైనర్ సర్జరీనేనని, ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని తెలిపారు డాక్టర్లు. కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని, కంగారు పడాల్సిందేమి లేదని తెలిపారు.

అఖండతో భారీ సక్సెస్‌ను అందుకున్నారు బాలయ్య. ఇక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

- Advertisement -