ధోని బాటలోనే రైనా..

156
dhoni
- Advertisement -

మహేంద్ర సింగ్ ధోని బాటలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు సురేష్ రైనా. ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్దిసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నీతో కలిసి ఆడడం కంటే మించింది ఏదీ లేదు…ఎంతో గర్వంగా ఈ ప్రయాణంలో నీతో కలిసి నడవాలనుకుంటున్నా…భారతావనికి కృతజ్ఞతలు…జైహింద్ అని పేర్కొన్నాడు రానా.

రైనా మొత్తం 226 వన్డేలు, 18 టెస్టులు, 78 టీ-20 మ్యాచ్‌లు ఆడి సత్తా చాటాడు. వన్డేల్లో 6,005, టెస్టుల్లో 1,445 పరుగులు చేశాడు.వన్డేల్లో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ-20లో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. 2018 జూలైలో ఇంగ్లండ్‌తో చివరి వన్డే, టీ-20 ఆడాడు.

- Advertisement -