రీ ఎంట్రీతో అదరగొడుతున్నాడు భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా. ఏడాది తర్వాత దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌తో ఆరంగేట్రం చేసిన రైనా దూకుడుతో తన ఎంట్రీ కరెక్టేనని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన రైనా తాజాగా నిదహాస్ ట్రై సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
27 బంతుల్లో(1*4,1*6)తో 28 పరుగులు చేసిన రైనా టీ20ల్లో 50 సిక్స్‌లు బాదిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్‌గా పేరు తెచ్చుకున్న రైనా టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా మారాడు. టీ20ల్లో 50 సిక్స్‌లు బాదిన భారత ఆటగాళ్లలో 74 సిక్సర్లతో యువీ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా 69 సిక్సర్లతో రోహిత్ రెండవ స్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా క్రిస్ గేల్, న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సర్లతో అగ్రస్ధానంలో ఉన్నారు.
ఇక ట్రై సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన భారత్..బంగ్లాతో మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది. భారత్ తన తర్వాత మ్యాచ్ ఈ నెల 12న శ్రీలంకతో ఆడనుంది.