తప్పుడు ప్రచారం నమ్మకండి:సురేష్ గోపి

10
- Advertisement -

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు కేంద్ర సహాయశాఖమంత్రి, సినీ నటుడు సురేశ్ గోపి. కేంద్రమంత్రిగా తనను తప్పించాలని హైకమాండ్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతుందోని అదంతా తప్పుడు ప్రచారమేనని కట్టిపారేశారు.

కేబినెట్ మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము కేరళ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పారు.

లోక్ సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సురేశ్ గోపీ సీపీఐ నేత వీఎస్‌ సునీల్‌ కుమార్‌పై గెలిచారు. కేరళ నుండి గెలిచిన తొలి బీజేపీ ఎంపీగా నిలిచారు సురేశ్ గోపి.

https://x.com/TheSureshGopi/status/1800096601043800482?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1800096601043800482%7Ctwgr%5E4e5704a8fbd517ec12e2125617efc48029c4e58d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fnational%2Ffact-check-suresh-gopi-denies-reports-of-wanting-to-quit-union-ministry-832500.html

- Advertisement -