రామ్ చరణ్‌ మూవీలో మలయాళం స్టార్ హీరో..!

130
suresh gopi
- Advertisement -

తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రిలీజ్ కాబోతుంది. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే గ్రాండ్ గా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. అయితే ఇందులో మలయాళం స్టార్ సురేశ్ గోపీ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలమైనదిగా కనిపిస్తుందట. ఆ పాత్రకి సురేశ్ గోపీ అయితే సరిగ్గా సెట్ అవుతాడని భావించిన శంకర్, ఆయనను ఎంపిక చేశాడని అంటున్నారు.తెలుగులో సురేశ్ గోపీ చేస్తున్న తొలి సినిమా ఇది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్, సునీల్,అంజలి కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో చరణ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించను న్నారు. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా మారితే రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు సమూహమే కథాంశంమని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ విషయం బయటకు రాగానే భారతీయుడు రేంజ్ లో సినిమా ఉండబోతుందని అంచనాలు ఆకాశాన్నంటున్నతున్నాయి.

- Advertisement -