‘వెంకీమామ’ యాక్షన్‌పై సురేష్‌ బాబు అసంతృప్తి..!

342

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో నాగచైతన్య హీరోలుగా కె.ఎస్‌. రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘వెంకీ మామ’. ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించిన సంగతి తెలిసిందే.

Venky mama

గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదభరితంగా నిర్మితమైన సినిమా ఇది. ఈ కారణంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే విడుదలకు సంబంధించి మాత్రం ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. దాంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలుస్తుందా .. లేదా? అనేది సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

suresh

అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు ఉన్నాయట. ఆల్రెడీ పూర్తయి వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ సురేశ్ బాబుకి నచ్చకపోవడంతో, పర్ఫెక్ట్ గా చేసి పంపించమని చెప్పేసి వెనక్కి పంపించేశారట. రెండు రోజుల్లో ఆ అవుట్ పుట్ రానుంది .. అది సురేశ్ బాబుకి నచ్చితే, దానిని బట్టి విడుదల తేదీని ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు.