గోవాలోని డబ్ల్యూ రిసార్ట్ వేదికగా సమంత – నాగచైతన్య ల వివాహం మూడు కుటుంబాల మధ్య బ్రహ్మాండంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరు ఒక్కటయ్యారు. సుమారు నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ ప్రేమజంట వేదమంత్రాల సాక్షిగా భార్యా భర్తలయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం, అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబ సభ్యులతోపాటు కొద్దిమంది అతిధుల సమక్షంలో సమంత మెడలో చైతు మూడు ముళ్లు వేశారు.
అయితే పెళ్లి అర్ధరాత్రి కావడంతో దానికి ముందుగా సంగీత్ కార్యక్రమం జరిగింది. ఆ వేడుకలో అక్కినేని కుటుంబం తో పాటుగా రామానాయుడు కుటుంబం, సమంత కుటుంబాలు పాల్గొన్నాయి. చిన్నవాళ్ళు , పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా అందరూ ఈ సంగీత్ లోపెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగచైతన్య మేనమామలైన దగ్గుబాటి బ్రదర్స్ సురేష్ బాబు, వెంకటేష్ సందడి చేశారు. సురేష్ బాబుతో కలిసి సమంత చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.
నాగచైతన్య సురేష్ బాబు మేనల్లుడు కాబట్టి సమంత సురేష్ బాబు , హీరో వెంకటేష్ లకు కూతురు వరుస అవుతుంది. సురేష్ బాబు కి పెద్దగా డ్యాన్స్ రాకపోయినా సమంత తో కలిసి డ్యాన్స్ చేసి భయపెట్టాడు. సురేష్ బాబు పెళ్లి పెద్ద వేషధారణలో పంచ,చొక్కాలో వేసిన డ్యాన్స్ పలువురిని ఆకర్షించింది. సమంత క్లోజ్ ఫ్రెండ్స్ చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్, కామెడీ స్టార్ వెన్నెల కిషోర్, అడవి శేషు కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.