రామానాయుడి స్టుడియోలో డ్రగ్స్ కలకలం

211
ramanaidu-studios
- Advertisement -

హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ వ్యవహారం బయటపడటంతో ఆబ్కారీ శాఖ మత్తుమందులపై ప్రత్యేక దృషి పెట్టింది. ఈ వ్య‌వ‌హారంలో భాగంగా విదేశాల నుండి వ‌స్తున్న పార్సిల్స్ పై ఎక్సైజ్ అధికారులు ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన రామానాయుడు స్టుడియోకు విదేశాల నుంచి ఓ పార్శిల్‌ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ సీఐ కనకదుర్గ ఆధ్వర్యంలో ఓ టీం రామానాయుడు స్టూడియోకి వచ్చారు. అధికారుల రాకతో స్టూడియో టెన్షన్. వచ్చిన అధికారులు నేరుగా ఆఫీస్ లోకి వెళ్లారు. విదేశాల నుంచి వచ్చిన పార్సిల్ చూడాలని కోరారు. దాన్ని చెక్ చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఖంగుతిన్నారు. అందులో ఓ మెడికల్ కిట్ ఉంది. నడుం నొప్పి కోసం దాన్ని ఉపయోగిస్తుంటారు. విదేశాల్లో ప్రత్యేకంగా దొరికే ఈ పరికరాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నారు రానా. దీన్ని పరిశీలించిన అధికారులు డ్రగ్స్ ఏమీ లేవని నిర్ధారించుకుని వెళ్లిపోయారు.

దీనిపై దగ్గుబాటి సురేష్ బాబు కూడా స్పందించారు. తమకు విదేశాల నుంచి పార్శిల్‌ వచ్చిన మాట వాస్తవమేనని దగ్గుబాటి సురేశ్‌బాబు తెలిపారు. తన కుమారుడు రానా వెన్నునొప్పి నివారణ కోసం విదేశాల నుంచి ఓ పరికరాన్ని కొనుగోలు చేశారని.. దాని పార్శిల్‌ రామానాయుడు స్టుడియోకు వచ్చిందని వివరణ ఇచ్చారు. ఎక్సైజ్‌ సీఐ కనకదుర్గ పార్శిల్‌ను తనిఖీ చేసేందుకు స్టుడియోకు వచ్చారని తెలిపారు.

- Advertisement -