కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మాతగా తెరకెక్కిన ఖైదీ సంక్రాంతి బరిలో దూసుకొచ్చింది. విడుదలకు ముందే సాంగ్స్..టీజర్…ప్రీ రీలిజ్ ఫంక్షన్‌తో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఖైదీ నెంబర్ 150. డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించి, కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత అదే రేంజ్ పర్ఫామెన్స్ కనబర్చాడు.
మరి మెగాస్టార్ 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘ఉయ్యాలవాడ’ నరసింహారెడ్డి’ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. సురేందర్ రెడ్డి నిన్న ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ ను చిరంజీవికి వినిపించాడట.
చిరు స్క్రిప్ట్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడట.ఈ మూవీ ఓకే చేయమని చెప్పారట. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులకు శ్రీకారం చుట్టడానికి సమయం ఆసన్నమైంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకి గాను తాను అనుకున్న నటీనటుల గురించి కూడా సురేందర్ రెడ్డి చిరూతో చర్చించాడట. మరి ఆ జాబితాలో మార్పులు చేర్పులు ఏమైనా వుంటాయేమో చూడాలి.మరి సెకండ్ ఇన్నింగ్స్ బాస్‌కు కలిసివస్తుందా లేదా వేచి చూద్దాం