సురేఖా వాణి కూడా రెడీ అయ్యింది

68
- Advertisement -

తన భర్త చనిపోయాక నటి సురేఖా వాణి పెళ్లి చేసుకోబోతోదంటూ ఎప్పటికప్పుడు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా సురేఖా వాణి గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. త్వరలో ఓ బోల్డ్ క్యారెక్టర్ తో వెండితెరను ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఆమె సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే సినిమాల్లో కొన్ని సైడ్ పాత్రలలో కనిపించి అలరించినా, ఈ మధ్య ఆమె సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేదు. కారణం ఆమెకు అవకాశాలు తగ్గాయట. అందుకే, తనే మెయిన్ లీడ్ గా ఓ సిరీస్ కి రెడీ అయ్యింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ ఏమిటో చుపించాలని ఆశ పడుతుంది సురేఖా వాణి.

మొత్తమ్మీద మిడిల్ ఏజ్ దాటేసిన సురేఖా వాణి.. నేటి జనరేషన్ కి తగ్గట్టు.. పర్ఫెక్ట్ గా రెడీ అయిందట. అన్నట్టు ప్రెజెంట్ మ్యాటర్ లోకి వెళ్తే.. సురేఖా వాణి ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించింది. ‘కాల్ ఆంటీ’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్టార్ట్ కానుంది. కొత్త దర్శకుడు అవినాష్ తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ లో పొలిటిల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ వయసులో కూడా సురేఖా వాణి ఈ సిరీస్ కోసం మాస్ స్టెప్స్ వేయబోతుంది. కాగా వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా స్టార్ట్ కానుంది.

ఈ షూట్ లో సురేఖా వాణి తో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ భామగా సురేఖా వాణి ఓ ఊపు ఊపేసింది. మరి సురేఖా వాణి మొదటిసారి ఇలా ఓ వెబ్ సిరీస్ చేయడం, పైపెచ్చు సురేఖా వాణి ఈ సిరీస్ లో ఒక బోల్డ్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే సురేఖా వాణి పాత్ర చాలా వైల్డ్ గా కూడా ఉండనుందని తెలుస్తోంది. నటనలో పాతికేళ్ల అనుభవం ఉంది కాబట్టి, సురేఖా వాణి ఏదైనా చేయగలదు.

Also Read:Revanth Reddy:రేవంత్ రెడ్డి టీడీపీ కోసమేనా?

- Advertisement -