- Advertisement -
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇటీవలె హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలుపొందిన సురభి వాణీదేవి కరోనా బారిన పడ్డారు.
తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన వాణిదేవి… ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హోం ఐసోలేషన్‌తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్‌నగర్ నుండి ఎవరూ ఊహించని రీతిలో మాజీ ప్రధాని పీవీ కూతురును టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ బరిలోకి దింపిన కేసీఆర్…బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి రామ్‌చందర్ రావును ఓడించి తమకు పట్టు సడలలేదని నిరూపించారు.
- Advertisement -