భారత క్రికెటర్ మహమ్మద్ షమీకు సంబంధించిన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై కోల్‌కత్తాలో నమోదైన గృహహింస, భరణం కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని మాజీ భార్య హసిన్ జాహన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం తాము ఢిల్లీలో నివసిస్తున్నామని, ప్రతి విచారణ కోసం కోల్‌కత్తాకు ప్రయాణించడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
షమీ దేశవ్యాప్తంగా మ్యాచ్‌లు ఆడేందుకు తరచూ పర్యటిస్తుంటారని, కేసును ఢిల్లీకి మార్చినా ఆయనకు ఎలాంటి అసౌకర్యం ఉండదని హసిన్ జహాన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్‌పై స్పందించాలని సుప్రీం..మహమ్మద్ షమీకి, అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇటీవలే తనకు, తన కుమార్తె నెలవారీ జీవనాధారానికి చెల్లిస్తున్న భరణాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోర్టు తదుపరి విచారణలో ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
Also Read:కనిపించిన రంజాన్ నెలవంక

